నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు నుంచి 40మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తుందని, రూ.10 వేలు జీతం వస్తుందన్న భరోసాతోనే వారంతా పార్టీలో చేరారని పేర్కొన్నారు.
తెదేపాపై నమ్మకంతో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే .. మహిళా వాలంటీర్లకు గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక మహిళను ఓడించలేక వైకాపా నేతలు అనసవర విమర్శలకు దిగుతున్నారని, ఓట్లు అడిగే ముందు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.