బీజేపీ-టీడీపీ-జనసేన సీట్ల పంపకంలో మరోసారి త్యాగం చేసారూ పవన్ కళ్యాణ్. ఏపీలో పొత్తులు ఖరారు అయిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు జనసేన, టిడిపి మరియు బీజేపీలు ఏకమయ్యాయి. మూడు పార్టీలు కలిసి… ఈసారి ఎన్నికల బరిలో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపిణీ విషయంలో చాలా తేడాలు వస్తున్నాయి. మొన్నటి వరకు ప్రధాన పార్టీగా ఉండగా.. పొత్తు పెట్టుకోగానే ఆ పార్టీ ప్రాధాన్యత తగ్గిపోయింది.
ఇక ఏపీలో పొత్తుల లెక్క తాజాగా తేలిపోయింది. టిడిపి పార్టీ 17 ఎంపీ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. బిజెపి 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తుంది. జనసేన రెండు ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. బిజెపికి విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నర్సాపూరం, అరకు, తిరుపతి లోక్సభ సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. కాకినాడ మరియు మచిలీపట్నం ఎంపీ స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. ఇక మిగతా 17 లోక్సభ స్థానాలలో టీడీపీ బరిలో ఉండనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.