వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైకాపా ప్రాథమిక సభ్య త్వా నికి రాజీనామా చేశారు. ఈనెల 9న ప్రజల సక్షమంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
గతంలో పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన ఆమంచికి టికెట్ దక్కలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.