ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల ఈసీ బదిలీ వేటు వేసింది. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బు రాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. వీరి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన అధికారులు ఈరోజు రాత్రి 8గంటల్లోగా ఛార్జ్ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
తిరుపతి కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్
గుంటూరు IG గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
ప్రకాశం SP గా సుమిత్ సునీల్
పల్నాడు SP గా బిందు మాధవ్
చిత్తూరు SP గా మణికంఠ చందోలు
అనంతపురం SP గా అమిత్ బర్దార్
నెల్లూరు SP గా ఆరీఫ్ హఫీజ్