మంగళగిరిలో జరుగుతున్న బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక హామీ ఇచ్చారు. బీసీలకు ఎంత మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని, మేము అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు.ఇప్పుడు జనాభానే ఆస్తి అని, బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే….అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ బీసీల పొట్ట కొట్టారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. బీసీల సంక్షేమానికి రూ. 75 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం మోసం చేశారు. కార్పొరేషన్లను ప్రకటించి కుర్చీలు కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. వారికిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని అన్నారు. సీఎం జగన్ పాలనలో బీసీ లకు రక్షణ కరువైంది’ అని ఆయన తెలిపారు.