కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి తెలంగాణ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిను హరీష్ రావు ఆహ్వానించారు. దీంతో త్వరలోనే జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి కూడా తెలిపారు. త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకుంటానన్నారు.
ఇక ఇది ఇలా ఉండగా… నిన్న ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి బరిలో ఉండాలని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుకున్నారు. కానీ.. కాంగ్రెస్ టికెట్ అజారుద్దీన్ కు దక్కింది. బీఆర్‌ఎస్ టికెట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీలో చేరి, అజారుద్దీన్ ను ఓడించేందుకు విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధం అవుతున్నారు.