హరీష్ శంకర్ డైరెక్షన్ లో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి భగత్స్ బ్లేజ్ పేరుతో వీడియోను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. జాతర సమయంలో హింసకి పాల్పడటానికి ట్రై చేసిన రౌడీ మూకకి పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పడం ఈ వీడియోలో చూపించారు. ఈ నేపథ్యంలో ‘గ్లాస్ పగిలేకొద్దీ పదునెక్కుతుంది’, ‘గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగుపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో CEO ముకేశ్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు తెలిపారు. ఉస్తాద్ భగత్సింగ్ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వాలంటీర్లు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.