Election Updates: తెలంగాణ బీజేపీ తుది లిస్ట్ లో మార్పులు !

TG Politics: BJP is working on the second list of MP candidates.. will it be released that day..?
TG Politics: BJP is working on the second list of MP candidates.. will it be released that day..?

తెలంగాణ బీజేపీ తుది లిస్ట్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితం 14 మందితో తుది జాబితా ప్రకటించిన బిజెపి తాజాగా అందులో రెండు మార్పులు చేసింది. అలంపూర్ సీటును తోలుత మేరమ్మకు ఇవ్వగా ఇప్పుడు రాజగోపాల్ కేటాయించింది. అటు బెల్లంపల్లి స్థానంలో శ్రీదేవికి టికెట్ ఇచ్చారు. మొదట జాబితాలో ఈ సీటును కొయ్యల ఎమాజీకి ఇస్తూ బిజెపి లిస్టు రిలీజ్ చేసింది. కాగా కమలం పార్టీ మొత్తం 111 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా…. పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించింది.

ఎన్నికలకు 14 మందితో బిజెపి జాబితా

బెల్లంపల్లి-శ్రీదేవి,
పెద్దపల్లి-దుద్యాల ప్రదీప్,
సంగారెడ్డి-రాజేశ్వర్ రావు,
మేడ్చల్-ఏనుగు సుదర్శన్ రెడ్డి,
మల్కాజ్గిరి-రామచంద్ర రావు,
శేరిలింగంపల్లి-రవికుమార్,
నాంపల్లి-రాహుల్ చంద్ర,
చాంద్రయాణగుట్ట-మహేందర్,
కంటోన్మెంట్-గణేష్,
దేవరకద్ర-ప్రశాంత్ రెడ్డి,
వనపర్తి-అనూజా రెడ్డి,
అలంపూర్-రాజగోపాల్ ,
నర్సంపేట-పుల్లారావు,
మధిర-విజయరాజు.