నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులో నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనంతరం ప్రజాప్రతినిధులు, న్యాయ అధికారులతో సీఎం జగన్ సమావేశం ఉంటుంది. బనగానపల్లిలో 100 పడకల ఆసుపత్రి, ఈబిసి నేస్తం ప్రారంభం కానుంది. అనంతరం బనగానపల్లి బహిరంగసభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్.
బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే… 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ. 15,000 చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయనుంది. ఈ పథకం కింద మూడేళ్ల పాటు 45 వేల రూపాయల ఆర్థిక చేయూత అందించనుంది ఏపీ సర్కార్.