Election Updates: ఎన్నికల వేళ వైసీపీ నేతలకు సీఎం జగన్ మార్గదర్శకాలు

Election Updates: CM Jagan made a key announcement on pension hike
Election Updates: CM Jagan made a key announcement on pension hike

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఓవైపు వైఎస్సార్సీపీ, మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికల్లో తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో ఇక ప్రచారంపై ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా కసరత్తు చేస్తోన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు సీఎం జగన్ కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున నాయకులంతా తమ గెలుపు కోసం పకడ్బందీ ప్రణాళిక రచించుకోవాలని సూచించారు. అభ్యర్థులంతా ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి, ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని దిశా నిర్దేశం చేశారు.

వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసి సంక్షేమ పథకాలను వివరించాలని అభ్యర్థులకు జగన్ సూచించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్ల­మెంటు నియో­జ­కవర్గాల్లో మార్పులు చేశామని తెలిపారు. ఆయా నియోజక­వర్గా­ల్లోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరి­చి, వారిని ఏకతాటి­పైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు. 25కు 25 లోక్‌సభ, 175కు 175 శాసనసభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలని జగన్ పేర్కొన్నారు.