Election Updates: పులివెందులలో ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టనున్న సీఎం సతీమణి

Election Updates: CM's wife will take up the responsibility of election campaign in Pulivendului
Election Updates: CM's wife will take up the responsibility of election campaign in Pulivendului

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ నామినేషన్ దాఖలుకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 22 న సీఎం జగన్ నామినేషన్ దాఖలకు ముహూర్తం ఖరారు చేశారు. సీఎం జగన్ ఈ నెల 22న పులివెందుల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు పులివెందులలో సీఎం నామినేషన్ దాఖలు చేసేలా ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 21న జగన్ కుటుంబంతో కలిసి పులివెందులకు చేరుకుంటారు.

నామినేషన్ అనంతరం పులివెందుల లో ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టనున్న సీఎం సతీమణి వైఎస్ భారతి ఎన్నికల పూర్తి అయ్యే వరకు పులివెందులలో మకాం చేయనున్నారు. జగన్ వైపు భారతి ప్రచారం,వ్యతిరేకంగా చెల్లెళ్ళు షర్మిల, సునీత ప్రచారం చేస్తుండటంతో పులివెందుల రాజకీయాలు కొత్త రూపు దాల్చనున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పులివెందుల ఎన్నికల పై ఆసక్తి కనబరుస్తున్నారు.