కాంగ్రెస్ పార్టీకి సీపీఎం పార్టీ డెడ్ లైన్ ఇచ్చింది. నేటి మధ్యాహ్నం లోపు పొత్తులపై ఏ విషయం తేల్చాలని కాంగ్రెస్ కు సిపిఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డెడ్ లైన్ విధించారు. ‘సిపిఐతో చర్చించి కుదిరితే కలిసి పోటీ చేస్తాం. లేదంటే ఒంటరిగా దిగుతాం. కాంగ్రెస్ నిర్ణయం కోసం గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురు చూస్తామని తమ్మినేని చెప్పారు .
పొత్తులు కుదరకపోతే మా అభ్యర్థుల్ని ప్రకటిస్తాం. ఇప్పటికే మా పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి’ అని వీరభద్రం చెప్పారు. ఈ ఎన్నికల్లో మొదట 5 సీట్లు అడిగామని… కానీ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు ఇస్తామని చెప్పినట్లు సిపిఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివరించారు. అయినా తాము ఒప్పుకున్నామని.. కానీ ఇప్పుడు మాట మార్చినట్లు చెప్పారు. తమకు 2 కంటే తక్కువ సీట్లు ఇస్తే.. తెలంగాణలో సొంతగా పోటీ చేస్తామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.