ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడ పర్యటిస్తే అక్కడ అధికారులు చెట్లు నరికేయడం సర్వసాధారణంగా మారింది. గురువారం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లె నుంచి నాయుడుపేట వరకు సీఎం బస్సు యాత్ర చేపట్టనున్నారు.
దీంతో ఆ మార్గంలోని గుత్తివారిపల్లెలో ఒక ప్రైవేటు స్థలంలో యజమానికి చెప్పకుండా చెట్లు నరికేశారు. మిగతాచోట్ల కూడా అక్కడక్కడా చెట్లు కొట్టేశారు.