Election Updates: ఏపీలో DSC పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్

Election Updates: DSC post wise exam schedule in AP
Election Updates: DSC post wise exam schedule in AP

ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (TR-DSC) మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు జరగనున్న విషయం తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్(STT) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న TGT, PGT, ప్రిన్సిపల్ పోస్టులకు ఇంగ్లీషు భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు.

ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, TGT, PGT, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పించనున్న అధికారులు.. 25 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆయా పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ ఇదే. వీటిని అభ్యర్థులు గమనించగలరు.