Election Updates: ఏపీలో ఎలక్షన్ టైం.. భారీగా పట్టుబడిన మద్యం..

Election Updates: Election time in AP.. Heavily seized liquor..
Election Updates: Election time in AP.. Heavily seized liquor..

ఎలక్షన్ టైం కావడంతో.. మద్యం, డబ్బు భారీగా పట్టుబడటం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ (AP) ఆర్థిక రాజధాని విజయవాడలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. విజయవాడలోని మోపిదేవి మండలంలోని పెద్దప్రోలు శివారు కప్తానిపాలెం ఎస్సీ కాలనీలో డి వేణు అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. కాగా వేణు అధికారుల కళ్లుగప్పి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు.

అయితే పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ గ్రామోత్సవం జాలుగుతోంది. ఈ నేపథ్యంలో జాతరకు మరింత సరుకు అమ్ముడుపోతుందనే ఉద్దేశంతో వేణు అక్రమంగా మద్యం కొనుగోలు చేసి తనవద్ద ఉంచుకున్నారు. అయితే వేణు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు మచిలీపట్నం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు సమాచారం అందించారు. మచిలీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేణు ఇంటికి వెళ్లి సోదాలు జరిపారు. మచిలీపట్నం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు 60 మద్యం బాటిల్లను గుర్తించారు. ఆ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వేణును అదుపులోకి తీసుకుని అవనిగడ్డ ఎక్సైజ్ సీఐకి అప్పగించారు. వేణు పై అవనిగడ్డ ఎక్సైజ్ సీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ బాటిళ్లను జేసీబీతో ధ్వంసం చేశారు.