Election Updates: కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్.. మాజీ మంత్రి ఆగ్రహం

Election Updates: Even if the code comes into force, illegal mining.. Ex-minister angry
Election Updates: Even if the code comes into force, illegal mining.. Ex-minister angry

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగళ్లూరులో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని తెదేపా నాయకులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. సోమిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ దస్త్రాల ప్రకారం తవ్వకాలు జరిగే ప్రాంతం అటవీశాఖ భూమిగా ఉందని, సంబంధిత అధికారులేమో రెవెన్యూ భూమి అని చెబుతున్నారని తెలిపారు. భూమి ఎవరిదనేది తేలే లోపు అక్రమార్కులు రూ.400 కోట్ల విలువైన మైకాతో కూడిన క్వార్ట్జ్(తెల్లరాయి)ను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. జీపీఎస్ ఆధారిత ఫొటోలతో సహా కలెక్టర్కు పంపగా ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో ఫిర్యాదును మైనింగ్ అధికారులకు పంపామని చెబుతున్నారు. సామాన్యుడు ఇంటి అవసరాలకు ట్రక్కుతో మట్టి తీసుకెళుతుంటే నాన్బెయిలబుల్ కేసు పెట్టి వెంటాడుతున్న పొదలకూరు సీఐకి ఈ దోపీడీ కనిపించలేదా?’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఈ మైనింగ్ దందాను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. తెదేపా నాయకులు పలువురు పాల్గొన్నారు.