ఏపీ రాష్ట్ర మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీ రాష్ట్రంలో ఉన్న బుడగ జంగాలు, వాల్మీకి, బెంతో ఒరియా, ఏ నేటి కొండా సామాజిక వర్గాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్సార్ చేయూత చివరి విడుత కార్యక్రమం ప్రారంభించనున్నారు సీఎం జగన్.
ఇవాళ అనకాపల్లికి వెళ్లనున్న సీఎం జగన్.. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత చివరి విడుత డబ్బులు ఖాతాలలో జమ చేయనున్నారు. కాగా వైఎస్సార్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏడాదికి 18, 750 ఇస్తున్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. ఇక క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోయినా వైయస్సార్ చేయూత పథకానికి అప్లై చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తు తో సెల్ఫ్ డిక్లరేషన్ పెడితే చాలని స్పష్టం చేసింది.