Election Updates: ఇంటికి చీర వచ్చిందా? లేదా? అంటూ ప్రశ్నించిన ఎంపీ

Election Updates: Has the saree arrived at home? Or? The MP questioned
Election Updates: Has the saree arrived at home? Or? The MP questioned

రాజమహేంద్రవరం నగర వైకాపా అభ్యర్థి, ఎంపీ భరత్రామ్ పేరిట కొన్ని రోజులుగా మహిళలకు డివిజన్ల వారీగా చీరలు పంపిణీ చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ ప్రస్తుతం డివిజన్లలో ప్రచారం మొదలుపెట్టిన ఎంపీ.. తాను ఇచ్చిన తాయిలాలపై ఓటర్లను ఆరాతీస్తున్నారు.

ప్రచారంలో భాగంగా ఓ ఓటరును.. ఇంటికి చీర వచ్చిందా? లేదా? అంటూ ఎంపీ ప్రశ్నించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై ఆర్వోకు ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.