ఎన్నిసార్లు కారు ఆపుతారంటూ పోలీసులపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల కోడ్ పేరిట పోలీసులు తన వాహనాన్ని పదేపదే ఆపుతున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ నేత నారా లోకేశ్. డీజీపీని తమాషాలు ఆడొద్దని చెప్పండంటూ స్థానిక పోలీసు అధికారిని హెచ్చరించారు.
నా కాన్వాయ్ 4 సార్లు పోలీసులు.. తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదే రోడ్డులో తిరిగే సీఎం, వైసిపి MLA, MLCల వాహనాలు ఎందుకు తనిఖీ చేయడం లేదని మండిపడ్డారు. చట్టం అందరికీ సమానంగా అమలు చేయాలి కదా! నన్ను టార్గెట్ చేసి వేధిస్తున్న పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్.