Election Updates: నన్ను, పొంగులేటిని ఓడించేందుకు రూ.వందల కోట్లు: తుమ్మల

Election Updates: Hundreds of crores of rupees to defeat me and Ponguleti: Tummala
Election Updates: Hundreds of crores of rupees to defeat me and Ponguleti: Tummala

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో తనను… పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓడించేందుకు భారత రాష్ట్ర సమితి పార్టీ వందల కోట్లు ఖర్చు చేస్తుందని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉందని, కోట్లు కుమ్మరించి తమ నాయకులు అలాగే కార్యకర్తలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి వచ్చాక ఈ అరాచకాలు అన్నిటికీ చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని తుమ్మల వార్నింగ్ ఇచ్చారు. పువ్వాడ అజయ్ కుమార్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని ఆరోపణలు చేశారు తుమ్మల నాగేశ్వరరావు. అఫిడవిట్ కు సంబంధించి ఫార్మాట్ మార్చడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇంత రస వత్తర పోటీ, ఇంత కసి పట్టుదల ఉన్న ఎన్నికలు చూడలేదన్నారు. ఓ పక్క ఖమ్మం జిల్లా ఒకపక్క తెలంగాణ రాష్ట్రమంతా…. అన్నట్లుగా ఎన్నికలు జరుగుతున్నాయని వెల్లడించారు తుమ్మల నాగేశ్వరరావు. పరువు రాష్ట్రంలో తెలంగాణ ఎన్నికలపై అలాగే ఖమ్మం ఎన్నికలపై పందాలు నిర్వహిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.