సీఎం జగన్ గారు పిట్టలదొరలా మాట్లాడడం దురదృష్టకరమని, విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బెండపూడి ఇంగ్లీష్ యాసలో విశాఖపట్నమే రాష్ట్ర రాజధానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, విశాఖపట్నంలోనే మళ్లీ సీఎంగా తానే ప్రమాణ స్వీకారం చేస్తానన్న జగన్ గారికి రానున్న ఎన్నికల్లో అసలు ప్రతిపక్ష నేత హోదానైనా దక్కుతుందా? అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.
ఇప్పటి వరకు విశాఖపట్నం వాసులు 25 నుంచి 30 శాతం మంది తెలిసో, తెలియకో వైకాపాకు ఓటు వేస్తారని భావించానని, ఇప్పుడు ఆ ఓట్లు కూడా పడేలా లేవని ఆయన అన్నారు.విశాఖపట్నంలో అన్న వస్తున్నారంటే పారిపోయే పరిస్థితి నెలకొందని, జగన్ మోహన్ రెడ్డి గారి ప్రస్తుత ప్రకటన విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్న బొత్స ఝాన్సీ గారిపై తీవ్రంగా పడే అవకాశం ఉందని, పొలాలలో ఏనుగులు వచ్చి పడినప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు విశాఖ వాసుల పరిస్థితి అలాగే తయారయ్యిందని, ఏనుగులే మేము వస్తున్నామని ప్రకటించిన తరువాత, ఇప్పుడు విశాఖ వాసుల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.