నెల్లూరులో జగన్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. వైకాపా నుంచి నేతలంతా బయటికి వస్తున్న తరుణంలో తెదేపా నేతలపై కక్ష సాధింపు చేస్తోంది. తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజేతారెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మం నివాసాల్లో తనిఖీలు చేశారు. విజేత ఇంటిని 20 మంది పోలీసులు చుట్టుముట్టి హంగామా చేశారు. ఇంట్లో వస్తువులు, బీరువాలు తనిఖీ చేశారు. రూ.25 వేలు నగదు తప్ప మరేమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. పోలీసుల తనిఖీలు నేపథ్యంలో విజేతారెడ్డి నివాసం వద్దకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వెళ్లారు. తెదేపా నేతల ఇళ్లలో పోలీసుల సోదాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా?అని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ ఉందని.. అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. వ్యాపారవేత్త గురుబ్రహ్మం నివాసంలో ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు.