ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష అలియాస్ బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలో స్వాతంత్ర్య అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. ఈ విషయం ఈమె నామినేషన్ వేసినప్పటి నుండి విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో బర్రెలక్క కొల్హాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనుంది. ఇక ప్రచారంలో పాల్గొంటున్న బర్రెలక్క ఎదురైన ఒక అనుభవాన్ని ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతుంటే ఎదురుగా వాళ్ళు నన్ను డబ్బులు అడుగుతున్నారంటూ బర్రెలక్క చెప్పింది.
ఇంకా కొందరు ఏమో మా ఇంట్లో మొత్తం ఇన్ని ఓట్లు ఉన్నాయి ఎంత డబ్బులు ఇస్తారంటూ భేరం ఆడారంటూ బర్రెలక్క చెప్పుకుని ఆశ్చర్యపడింది. అలాంటి వారికి నేను ఒకటే చెబుతున్న నా దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బుతో ఓటు వేయించుకుని, ఆ తర్వాత అదే డబ్బు సంపాదించుకోవడం కోసం నేను వారి నెట్టి మీద చెయ్యి పెట్టబోనని బర్రెలక్క మాట్లాడింది .