చరిత్రను మార్చే 3 సినిమాలివే…2500 కోట్ల బిజినెస్ చేయగలవా..?

ఆ మూడు సినిమాలపై భారీ అంచనాలు.. ఏకంగా రూ.2500 కోట్ల బిజినెస్..?
Salaar,Animal Movies

ప్రస్తుతం మన ఇండియన్ చిత్రాలు లు హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. మంచి కంటెంట్‌తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని ఇస్తున్నాయి .

ఇండియన్ చిత్రా లపై ఇటీవలి కాలంలో హాలీవుడ్ మేకర్స్ కూడా తెగ ప్రశంసలు కురిపిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం . అయితే రానున్న రోజులలో మరో మూడు పెద్ద మూవీ లు ప్రేక్షకులని పలకరించడానికి సిద్ధం అయ్యాయి . ఈ మూడింట్లో ఒక్కటైన బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అని అంటూ ఉన్నారు . ఈ ఏడాది షారుక్ పఠాన్, జవాన్ లతో బ్యాక్ టు బ్యాక్ రూ.1000 కోట్లు రాబట్టడం, అనంతరం ‘గదర్ 2’ రూ.550 కోట్లు కలెక్ట్ చేయడం, దివాళికి రిలీజ్ అయిన టైగర్ 3 కూడా మంచి కలెక్షన్స్ లని రాబడుతూ ఉండడం బాలీవుడ్‌కి కొంత బూస్టప్ ఇచ్చింది .

ఇయర్ ఎండింగ్‌లో బాలీవుడ్ అద్భుతాల ను సృష్టిస్తుంది. అయితే డిసెంబర్ నెలలో బాలీవుడ్ నుంచి ఏకంగా మూడు బడా సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, వాటి కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు . ముందుగా విక్కీ కౌశల్ నటించిన ‘సామ్ బహదూర్ సినిమా పై ఒక రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. సినిమా టాక్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద రూ.200 నుంచి రూ.300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు కూడా వస్తున్నాయి . మరో మూవీ ‘యానిమల్’ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లు కూడా ప్రేక్షకులకి మంచి వినోదం పంచడం ఖాయం అని అంటున్నాడు.

ఆ మూడు సినిమాలపై భారీ అంచనాలు.. ఏకంగా రూ.2500 కోట్ల బిజినెస్..?
Salaar,Animal Movies

యానిమల్ కచ్చితంగా రణబీర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక డంకీ మూవీ తో అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు షారూఖ్ ఖాన్. డిసెంబర్ 21న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇండస్ట్రీలో భారీ అంచనాలున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1500 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటూ ఉన్నారు .సామ్ బహదూర్, యానిమల్, డంకీ మూవీ లు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ప్రభాస్ నటించిన ‘సలార్’ కూడా డిసెంబర్ 22న విడుదల కానుండగా, ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ప్రభాస్ మార్కెట్‌ని బట్టి సలార్ హిందీ వర్షన్ కేవలం నార్త్ లోని రూ.500 కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అని అంటూ ఉన్నారు . మొత్తానికి ఏడాది చివరిలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.2500 నుంచి రూ.3000 కోట్ల కలెక్షన్స్ రావడం పక్కా అని తెలుస్తుంది .