జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే… గెలిచే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక మరియు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఈసారి ఎలాంటి తప్పిదం జరగకుండా ఖచ్చితంగా గెలవాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా పిఠా పురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 91,000 కాపుల ఓట్లు ఉన్నాయి. కాపు ఓట్లన్నీ జనసేనకు పడతాయని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చేనందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. పవన్ కళ్యాణ్ పై పోటీకి ముద్రగడ ఫ్యామిలీ మెంబెర్ బరిలో దింపనున్నారట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి ముద్రగడను బరిలో దింపనున్నారట. దింతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారట. ముద్రగడ జనసేనలోకి వెళ్లకపోతే అతన్ని వైసీపీలో తీసుకొని.. పవన్ కళ్యాణ్‌పై పోటీకి వైసీపీ వర్గాలు బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.