కరెంటు బిల్లులు ఎవ్వరూ కట్టొద్దు… వచ్చే నెలలో కాంగ్రెస్ వస్తుంది… 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. నిన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సనత్ నగర్ లో మాట్లాడుతూ..ఆలుగడ్డలు అమ్మినట్లు ఇక్కడి ఎమ్మెల్యే సనత్ నగర్ పేదల బతుకులను అమ్మేస్తుండు..బీఆరెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహించారు. పదేళ్లు గడిచినా పేదలకు బీఆరెస్ చేసిందేం లేదు…బీఆరెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు.. పెద్దల ప్రభుత్వం అన్నారు.
ఇది దోపిడీ ప్రభుత్వం.. దొంగల ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. ఈ దోపిడీ ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తామని.. గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.