BRS MLC కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న BRS MLC కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా BRS MLC కల్వకుంట్ల కవిత ఎన్నికల కమిషన్ అధికారులకు పూర్తిగా సహకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక ఇవాళ సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవిత ఓ ట్వీట్ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు… సీఎం కేసీఆర్ గారిని చూసి ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారికి వాతలే మిగులుతాయి తప్ప ఫలితం మాత్రం శూన్యం అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లు ఎన్ని చోట్ల పోటీ చేసినా విజయం మాత్రం బీఆర్ఎస్ పార్టీదేనన్నారు.