సీఎం జగన్ పై నాకు ఎలాంటి ద్వేషం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వేరు, జనసేన పార్టీ వేరు అన్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. రౌడీలు, రాజకీయనాయకులు నాలాంటి వారిని చూడలేదు. పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
వైసీపీ సభల్లో గ్రాఫిక్స్ తో దొరికిపోయారు. పాపం జగన్ కి గ్రాఫిక్స్ పై అవగాహన లేదు.. గ్రాఫిక్స్ ని ఎలా వాడాలో సీఎం జగన్ కి తెలియలేదు. నాకు బలం లేదని నాకు తెలుసు.తగ్గే కొద్ది ఎదుగుతాం తప్ప నాశనం అవ్వమని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ సిద్ధం సభలపై పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. నేను రాజకీయాల్లోకి నా అభిమానుల కోసం రాలేదు. కష్టాల్లో ఉండే వారిని ఆదుకునేందుకు వచ్చాను. నన్ను కొట్టే ప్రతీ దెబ్బను వాడుకొని ఎదుగుతాను.