Election Updates: చంద్రబాబుతో భేటీ అయినా పవన్ .. దిల్లీ పరిణామాలపై చర్చ!

Election Updates: Pawan Kalyan meets Chandrababu Babu
Election Updates: Pawan Kalyan meets Chandrababu Babu

తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్కల్యా ణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు.

జనసేన-తెదేపా కూటమిలో భాజపా చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చం ద్రబాబు, పవన్ దిల్లీ వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాలపై నేతలిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం.