Election Updates: పోలింగ్ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు

Election Updates: Polling day is a holiday for all government offices and educational institutions
Election Updates: Polling day is a holiday for all government offices and educational institutions

ఈ నెల 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిఎస్ శాంతి కుమారి ఆదేశించారు. తాజాగా దీనిపై జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నమెంట్ ఆఫీసులో విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 100% పోలింగ్ నమోదే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇవాళ్టితో నామపత్రాల దాఖలుకు గడువు ముగియనుంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బీఫాంలు సమర్పిస్తేనే ఆయా పార్టీల అభ్యర్థులుగా గుర్తిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బీ ఫాంలు సమర్పించకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తామని తెలిపింది. ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేయనుండగా ఉపసంహరణకు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈనెల 30వ తేదీన పొలింగ్‌ జరగనుండగా.. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.