Election Updates: జనసేన తరఫున ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: అనసూయ

Election Updates: Ready to campaign for Janasena: Anasuya
Election Updates: Ready to campaign for Janasena: Anasuya

రాజకీయాలపై ప్రముఖ నటి, యాంకర్ అనసూయ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. కానీ ఒకవేళ నన్ను పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తాను అని తెలిపారు. ఏ లీడర్ నచ్చితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తా అని అన్నారు. వాళ్ల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తా అని స్పష్టం చేశారు. ఒకవేళ జనసేన పార్టీ నుండి పిలుపు వస్తే ఆ పార్టీ తరుపున ప్రచారం చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్లుగా నటి అనసూయ తెలిపారు.

డేట్స్‌ సర్దుబాటుకాకపోవడం వల్లే జబర్దస్త్‌ మానేశానని అనసూయ తెలిపారు. ఇప్పటికీ కుదిరినప్పుడల్లా సెట్స్‌కు వెళ్తుంటానని తెలిపింది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో తన డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ పై తాజాగా అనసూయ స్పందించింది. కొంచెం పాతకాలం వ్యక్తి కాబట్టి తన డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఆయనకు నచ్చలేదమో.. తనపై ఉన్న చనువుతో పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం నచ్చలేదని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు కావచ్చు అని తెలిపింది.కోట శ్రీనివాసరావు చాలా పెద్దవారని.. సినిమాల్లో నెగెటివ్‌ పాత్రల్లో ఆయన చేసినట్లు ఎవరూ చేయలేరని ప్రశంసల వర్షం కురిపించారు.