Election Updates: రేణిగుంట కేంద్రంగా వైకాపా శ్రేణుల ప్రలోభాల వల..!

Election Updates: Renigunta is the center of Vaikapa's temptations..!
Election Updates: Renigunta is the center of Vaikapa's temptations..!

ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాష్ట్రవ్యాప్తంగా తాయిలాలు అందిస్తున్న వైకాపా శ్రేణులు అందుకు తిరుపతి జిల్లా రేణిగుంటను కేంద్రంగా ఎంచుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి చెందిన గోదాం నుంచి వస్తువులను సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు తరలించగా.. మంగళవారం మిగిలినవాటిని తీసుకెళ్లే క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సలోనికి సమాచారం అందింది. సామగ్రిని తీసుకెళ్తున్న లారీని ఆమె తన బృందంతో కలిసి పట్టుకున్నారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న గోదాంలో భారీఎత్తున సామగ్రితోపాటు డబ్బులు ఉంచినట్లు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి నరసింహయాదవ్తో పాటు కార్యకర్తలు ఆరోపించారు. వెంటనే గోదాం తెరవాల్సిందిగా డిమాండ్ చేశారు. పంచనామా నిర్వహించేందుకు అధికారులు రేణిగుంట తహసీల్దారుకు సమాచారమిచ్చినా.. అయిదు గంటల తరువాత ఆయన అక్కడికి చేరుకున్నారు. ఎట్టకేలకు రాత్రి 8 గంటల సమయంలో గోదాం తెరిచారు.

తేదీలతో సహా పుస్తకంలో రాసి..

గోదాంలో మొత్తం 52 వస్తువులను అధికారులు గుర్తించారు. ఓటర్లకు పంచేందుకు బొట్టు బిళ్లలు, టీషర్టులు, గొడుగులు, ఫొటో కీచైన్లు, చేతి గడియారాలు, సెల్ఫోన్ స్టాండ్లు, చీరలు, మైక్సెట్లు వంటివి ఉన్నాయి. వీటితోపాటు సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మోహిత్రెడ్డిల ఫొటోలున్న సంచులు పెద్దసంఖ్యలో ఉన్నాయి. కొంతమేర వైకాపా ఎన్నికల ప్రచార సామగ్రి కూడా లభించింది. ఏ నియోజకవర్గానికి ఏయే తేదీల్లో తాయిలాలు పంపించారనే వివరాలు ఒక పుస్తకంలో నమోదు చేశారు.