Election Updates: మేనిఫెస్టోపై టీ-బీజెపి కసరత్తు..నెరవేరేనా హామీలు..

Election Updates: Kishan Reddy made a key announcement on BJP's second list
Election Updates: Kishan Reddy made a key announcement on BJP's second list

తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా కార్యాచరణను ప్లాన్ చేస్తో ది. అమలు సాధ్యమయ్యే హమీలనే ఇస్తామని అంటోంది. తెలంగాణ అభివృద్ది ఎజెండాగా మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితినీ దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాల్ని ప్రకటిస్తామని తెలిపారు.ఎన్నికల మేనిఫెస్టో పై బీజేపీ కసరత్తు చేస్తుంది… మాజీ ఎంపీ వివేక్ చైర్మన్ గా మహేశ్వర్ రెడ్డి కన్వీనర్ గా, విశ్వేశ్వర్ రెడ్డి జాయింట్ కన్వీనర్ గా … వివిధ వర్గాలకు చెందిన వారిని సభ్యులుగా మేనిఫెస్టో కమిటీని వేసింది ఆ పార్టీ…. కమిటీ ఇప్పటికే సమావేశమై…మేనిఫెస్టో ఎలా ఉండాలి అనే దాని పై చర్చించింది..అన్ని సెక్టార్ లని పరిగణనలోకి తీసుకొవాలని , అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా తయారు చేయాలని డిసైడ్ చేసింది. అడ్డగోలుగా హామీలు కాకుండా నిర్మాణాత్మకంగా ఉండాలని నిర్ణయించింది…

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉచితాలు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ఉచిత పథకాలుకు ఆ స్థాయిలో ప్రాధాన్య త ఇస్తుందా అనే చర్చ జరుగుతుంది… మోడీనే ఫ్రీబీస్ వ్య తిరేకిస్తున్న నేపథ్యంలో పెద్దగా ఉండక పోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఉచిత విద్యా ,వైద్యంపై ప్రత్యే క దృష్టి పెట్టే అవకాశం ఉంది.. కౌలు రైతులకు ప్రాధాన్యత ఉండొచ్చు …ఉపాధి కల్పనా, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పా టు… కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా చూస్తామని సంకల్ప పత్రంలో చెప్పే అవకాశం ఉంది.. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని కిషన్ రెడ్డీ ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ కూడా విడుదల చేస్తామని బీజేపీ ప్రకటించింది… 2014, 2018లో ఆ పార్టీ మేనిఫెస్టో , వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు… అవి అమలు కానీ తీరు ను ఛార్జ్ షీట్ లో పెడతామని ఆ పార్టీ నేత మురళీధర్ రావు స్పష్టం చేశారు.