YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికలపై పోటీ చేయట్లేదని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామని తెలిపారు. YSRTP కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తమ ఉద్దేశమని షర్మిలా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చితే చరిత్ర నన్ను క్షమించదన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయట్లేదన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.