రేపు 40 మందితో బీజేపీ తొలి జాబితా కానున్నట్లు సమాచారం అందుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలివిడత అభ్యర్థులను ప్రకటించేందుకు తెలంగాణ బీజేపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. రేపు జాబితా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికి 60-70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై అధిష్టానం ఓ అంచనాకు రాగా, బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకుని జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. తొలి జాబితాలో 40 మంది అభ్యర్థులు ఉండొచ్చని చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా…జాబితా ప్రకటించగానే తెలంగాణ రాష్ట్రంలో బీసీ గర్జన సభ నిర్వహించాలని కమలదళం యోచిస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలనుకుంటోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలాఖరులోపు కేంద్రమంత్రి అమిత్షా, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారని వెల్లడించాయి.