బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 35 మంది అభ్యర్థులతో పాటు పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ కోర్ కమిటీ నేతలు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తెలంగాణ కోర్ కమిటీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్,డా. కే. లక్ష్మణ్, ప్రకాశ్ జవడేకర్, తరుణ్ చుగ్ హాజరయ్యారు.
సికింద్రాబాద్ మేకల సారంగపాణి, అంబర్ పేట కృష్ణ యాదవ్, జూబ్లీ హిల్స్ లంకల దీపక్ రెడ్డి, సనత్ నగర్ మర్రి శశీధర్ రెడ్డి, అచ్చంపేట దేవని సతీస్ మాదిగ, నారాయణపేట ఆర్.పాండు రెడ్డి, జడ్చర్ల చిత్తరంజన్ దాస్, మక్తల్ జలంధర్ రెడ్డి, వనపర్తి అశ్వద్ధామరెడ్డి, షాద్ నగర్ అందే బాబయ్య, దేవరకొండ కేతావత్ లాలు నాయక్, హుజూర్ నగర్ చల్లా శ్రీలత రెడ్డి, నల్గొండ మాదగోని శ్రీనివాస్ గౌడ్, ఆలేరు పడాల శ్రీనివాస్, పర్కాల కలి ప్రసాద్ రావు, పినపాక పాండియమ్ బాలరాజు, పాలేరు నున్న రవికుమార్, సత్తుపల్లి రామలింగేశ్వరరావు, మంచిర్యాల వీ. రఘునాథ్, అసిఫా బాద్ అజ్మీర ఆత్మరామ్ నాయక్, బోధన్ వి. మోహన్ రెడ్డి, భాన్సువాడ లక్ష్మీనారాయణ, నిజామాబాద్ రూరల్ దినేష్ కులచారి, మెదక్ పంజా విజయ్ కుమార్, నారాయణ ఖేడ్ జె. సంగప్ప, ఆందోల్ బాబు మోహన్, జహీరాబాద్ రామచంద్ర రాజనరసింహ, ఉప్పల్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీనగర్ సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల కే.ఎస్.రత్నం, మంథని చందుపట్ల సునీల్ రెడ్డి, పరిగి భూనేటి మారుతి కిరణ్, ముషీరాబాద్ పూస రాజుల పేర్లను మూడో విడతలో విడుదల చేశారు.