“లియో” సక్సెస్ మీట్ లో విజయ్..సంచలన వ్యాఖ్యలు..!

“లియో” సక్సెస్ మీట్ లో విజయ్..సంచలన వ్యాఖ్యలు..!
Cinema News

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మాసివ్ హిట్ సినిమా “లియో”. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేసిన రెండో సినిమా ఇది కాగా ఈ సినిమాతో తమిళ నాట విజయ్ ఎన్నో సెన్సేషనల్ రికార్డ్స్ అయితే సెట్ చేసాడు. మరి ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లతో దూసుకెళ్తుండగా మేకర్స్ నిన్ననే గ్రాండ్ సక్సెస్ మీట్ ని అయితే జరుపుకున్నారు . మరి ఈ మీట్ అండ్ ఈవెంట్ లో అంతా ఆసక్తిగా ఎదురు చూసింది విజయ్ స్పీచ్ కోసమే అని తెలిసిందే.

“లియో” సక్సెస్ మీట్ లో విజయ్..సంచలన వ్యాఖ్యలు..!
Leo Movie

మరి ఈ స్పీచ్ లో అయితే విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తిగా మారాయి. అయితే మొదట తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి వారు “చిన్న కలలు కాదు పెద్ద కలలు ” కనండి వాటిని సాధించేలా ప్రయత్నం చేయండి అని అంటూ ప్రేరేపించగా నెక్స్ట్ తమ ఇండస్ట్రీ హీరోస్ కోసం మాట్లాడుతూ కూడా ఒక్కడే సూపర్ స్టార్, ఒక్కరే ఉలగనాయగన్ అలాగే ఒక్కడే థలా అంటూ రజిని కమల్ మరియు అజిత్ ల కోసం కూడా మాట్లాడ్డం అయితే మరో లెవెల్లో వైరల్ గా మారిపోయింది . దీనితో విజయ్ స్పీచ్ నుంచి ఇవి మంచి హైలైట్స్ గా నిలిచాయి.