BREAKING : మేడిగడ్డ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్ ను పరిశీలించేందుకు రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. ఈ తరుణంలోనే..రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, భట్టిలకు మాత్రమే మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇది ఇలా ఉండగా..అంతకు ముందు మేడిగడ్డకు ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ చేరుకున్నారు. ప్రత్యేక హెలి క్యాప్టర్లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర రాహుల్ గాంధీ ల్యాండ్ అయ్యారు. ఈ తరుణంలోనే ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క… రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో అంబటిపల్లికి చేరుకుని.. మహిళా సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని రాహుల్ గాంధీ పరిశీలించారు.