తెలంగాణలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇవాళ మధ్యాహ్నం 2.30 కి కల్వకుర్తిలో సభ పాల్గొంటారు. అనంతరం రాహుల్ సాయంత్రం 4.30 కి జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు. అక్కడ నుం చి సాయం త్రం 6.15కిషాద్ నగర్ రైల్వే స్టేషన్ నుండి పాదయాత్ర .. చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. 3వ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్లు ఉండటం వల్ల 2వ తేదీన తెలంగాణలో జరిగాల్సిన రాహుల్ గాంధీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి నామినేషన్ల తర్వాత రాహుల్ గాంధీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిన్న కొల్లాపూర్‌లోని మహబూబ్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిజానికి ప్రియాంక గాంధీ ఇక్కడికి రావాలని అనుకున్నారని, అయితే ఆమె రాజకీయ సంబంధాల వల్ల కాదని, కుటుంబ అనుబంధం వల్లే ఇక్క డికి వచ్చిందన్నారు. ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉన్నా .. వారి దగ్గరకు రావాలనే ఉద్దేశం తోనే వచ్చా నన్నారు. ఈ ఎన్ని కల్లో దొరల తెలం గాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరు జరుగుతుందని రాహుల్ అన్నారు. ఒకవైపు కేసీఆర్ కుటుంబం, మరోవైపు మొత్తం తెలంగాణ సమాజం, మహిళలు, నిరుద్యోగులు అని రాహుల్ అన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని అన్నారు. ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని, అవినీతికి పాల్పడుతుందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయన్నారు. తమది దొరల పాలన కాదని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు భూములు పంపిణీ చేశారు. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామన్నారు. నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, సింగూరు ప్రాజెక్టులు నిర్మించామని చెప్పారు. ధరణి ఫోర్టల్ వల్ల తెలంగాణలో 20 లక్షల మంది రైతులు నష్టపోయారని అన్నారు. కేసీఆర్ కుటుంబం, వారి ఎమ్మెల్యేలు మాత్రమే లబ్ధి పొందారని అన్నారు.