కాంగ్రెస్ మూడో జాబితా విడుదల కావడంతో పలు నియోజకవర్గాల్లో అసంతృప్తులు భగ్గుమన్నాయి. బోథ్, వనపర్తిలో అభ్యర్థుల్ని మార్చడంతో వారి మద్దతుదారులు నిరసనలకు దిగారు. అటు నర్సాపూర్ అభ్యర్థిని మార్చాలంటూ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాగా, ఇప్పటికే చెన్నూరు, తుంగతుర్తి టికెట్లు దక్కకపోవడంతో మాజీ మంత్రి బోడ జనార్ధన్, గుడిపాటి నరసయ్య పార్టీకి రాజీనామా చేశారు.
అంతేకాదు… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు దామోదర రాజ నరసింహ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. దామోదర రాజ నరసింహ పఠాన్ చెరు టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు కాకుండా నీలం మధు కు ఇవ్వడంపై చాలా సీరియస్ అయ్యారట. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా పారాషూట్ నాయకులకు టికెట్లు ఇస్తున్నారని దామోదర రాజ నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ తరుణంలోనే దామోదర రాజ నరసింహ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారట దామోదర రాజ నరసింహ.