బిఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 109 మంది అభ్యర్థులను బీఫాంలు అందజేసింది. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించినా….ఇంకా బీఫాంలు ఇవ్వలేదు. అలంపూర్ స్థానానికి అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోగా…. బహదూర్ పుర, కార్వాన్, మలక్ పేట, చాంద్రయాణగుట్ట, చార్మినార్, యాకుత్ పుర స్థానాల్లో అభ్యర్థులకు బీఫాంలు అందాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటనలో భాగంగా రేపటి నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం… రేపు వనపర్తి, మునుగోడు, అచ్చంపేట సభల్లో పాల్గొననున్నారు. ముందుగా నాగర్ కర్నూల్ సభలో పాల్గొంటారని పేర్కొన్న…. తాజాగా వనపర్తికి మార్చారు. ఈనెల 27న వర్ధన్నపేట, మహబూబాబాద్ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.