సీఎం పదవీపై తెలంగాణపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. కోడంగల్ బిడ్డకు రాష్ట్ర నాయకత్వం లభించబోతుంది. నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని పేర్కొన్నారు. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సీఎం రేసులో ఉన్నాడని ఎంపికపై కాంగ్రెస్ కి క్లారిటీ ఇచ్చిందన్నారు. సీఎం ఎవరు అనేది సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే డిసైడ్ చేస్తారన్నారు.
ముఖ్యంగా కొడంగల్‌లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి… తన కోసం కాదు.. హస్తం పార్టీ కార్యకర్తలు, ప్రజల కోసమేనని తెలిపారు. తనకు పదవి లేకపోయినా కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. కొడంగల్ ఆత్మగౌరవం కోసం శాసనసభలో పోరాటం చేశానని చెప్పారు. తనను గెలిపిస్తే కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జెండా ఎగురవేయమని లక్షలాది మంది కార్యకర్తలు తనను ఆశీర్వదించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.