Election Updates: పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి షాక్.. కీలక నేత రాజీనామా

Election Updates: Shock for BRS in Patan Cheru Constituency... Key leader resigns
Election Updates: Shock for BRS in Patan Cheru Constituency... Key leader resigns

పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో కొత్తపల్లి గ్రామంలో BRS నేత నీలం మధు ముదిరాజ్ BRS పార్టీ కి రాజీనామా చేశారు. కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. చివరి క్షణం వరకు BRS పార్టీ టికెట్ ఆశించి బంగపడ్డారు నీలం మధు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కు నిన్న బి ఫాం రావడంతో నీలం మధు ముదిరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం ప్రెస్ మీట్ కీలక వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరు లో అహంకారం కావాలా.. ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నా.. మీ బిడ్డనై వస్తున్నా. BRS కు రాజీనామా చేస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో ప్రజల మనిషిగా పోటీ చేస్తున్నాప్రజల కోసం ఐదు అంశాల పోస్టర్ రిలీజ్ చేస్తున్నాను.

1.మౌలిక వసతులు
2.విద్యా, ఆరోగ్య సంరక్షణ
3.ఉపాధి అవకాశాలు
4.పర్యావరణ పరిరక్షణ
5. మీ బిడ్డనై వస్తన్న బీసీ బిడ్డను ఆశీర్వదించండి .

ప్రజలే మా గుర్తు… బ్యాలెట్ పేపర్ లో నా బొమ్మ చూసి ఓటు వేయండి. ఎమ్మెల్యేగా గెలిస్తే గుడ్ మార్నింగ్ పటాన్ చెరు పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు. దోచుకొని… దాచుకోవడం మహిపాల్ రెడ్డి తత్వం అని.. కుటుంబ పాలన కు చరమ గీతం పాడాలన్నారు. అందరి బాగోగులు నాకు చాలా ముఖ్యం అని తెలిపారు. నవంబర్ 30న బ్యాలెట్ పై నా బొమ్మ చూసి ఓటు వేయండి సూచించారు.