కరోనా కాలంలో వణ్యచరజీవులు ప్రజల్లోకి వస్తున్నాయి. అడవిని వదిలి ఊర్లలో.. పొలాలలో సంచరిస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఓ ఆటలా వాటిపై పడి చిత్రహింసలు పెడుతున్నారు. ఆ తాకిడితో అడవి జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అయితే గతంలో కేరళలోని మల్లప్పరంలో గర్భంతో ఉన్న ఏనుగు పేలుడు పదార్ధాలు ఉన్న పైనాపిల్ తిని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కేరళ సర్కార్ అప్రమత్తమైంది. వన్యప్రాణాలు సంచరించే ప్రాంతాల్లో నిఘాను పెంచింది. మల్లప్పరం వంటి ఘటనలు తిరిగి మరలా ఎక్కడా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఏనుగు మరణానికి కారణమైన వ్యక్తులపై ఇప్పటికే కేసులు కూడా పెట్టారు. ఆ కేసుపై విచారణ కూడా కొనసాగుతుంది.