ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్…ఇద్దరు మావోయిస్టుల హతం !

ENCOUNTER

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంత ఏకైక బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని కాల్చి చంపిన మావోయిస్టు కమాండర్‌ను కాల్చి చంపినట్లు పోలీసులు ప్రకటించారు. దౌలికర్క అడవుల్లో ఉదయం మావోయిస్టులు తిరుగుతున్నట్లు తెలియడంతో పోలీసులు కూంబింగ్ చేశారు. ఈ క్రమంలో అటు మావోయిస్టులు ఇటు పోలీసుల మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఓ మావోయిస్టు కమాండర్, మరో మావోయిస్టును మట్టుపెట్టారు. గాయపడిన మరో మావోయిస్టు దస్రును ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. IEDల ఎక్స్‌పర్ట్ అయిన వర్గీస్ పెట్టిన మందుపాతర పేలడంతో ఏప్రిల్ 9న ఎమ్మెల్యే భీమా మండవీ చనిపోయారు. శక్తిమంతమైన పేలుడుకి భీమా మాండవీ ప్రయాణస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా గాల్లోకి లేవగా భారీ పేలుడుకి మాండవీ శరీర భాగాలు చెల్లాచెరుగుగా ఎగిరిపడ్డాయి. ఈ దాడిలో ఆయనతోపాటూ మరో ముగ్గురు భద్రతా సిబ్బంది, ఓ పోలీస్ డ్రైవర్ కూడా చనిపోయారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 3 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని బహిష్కరించిన మావోయిస్టులు ప్రజలెవ్వరూ ఓటు వెయ్యొద్దని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ప్రజలను భయపెట్టేందుకు అడవుల్లో తిరుగుతున్నట్లు తెలిసింది.