రాష్ట్రంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశను హత్య చేసిన 10 రోజులకు నేడు ఎన్ కౌంటర్ జరిగింది. ఐతే ఈ ఎన్ కౌంటర్ పై దిశ తల్లిదండ్రులతో పాటు, నిర్భయ తల్లి, చాలా మంది ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు సామాజిక మాంద్యమాల్లో తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసులందరిపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు.
అయితే ఈ ఎన్ కౌంటర్ ఘటనపై పోలీసులు తీసుకున్న చొరవను చాలా మంది ప్రముఖులు తప్పు బడుతున్నారు. “అత్యాచారం తీవ్రమైన నేరమే. చట్టపరంగానే నిందితులకు కఠిన శిక్ష పడాలి. ఎన్ కౌంటర్ వంటి శిక్షలు సమాజానికి చేటు చేస్తాయి. తక్షణ న్యాయం కోసం బాధితులు ఎదురు చూస్తుంటారని తెలుసు. కానీ, దానికి ఇది పద్ధతి కాదు” అని కార్తి చిదంబరం చెప్పుకొస్తున్నారు.
సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ మాట్లాడుతూ… “తుపాకి తూటల న్యాయం అవసరం లేదు. ఇది కచ్చితంగా హర్షించతగ్గ పరిణామం కాదు. మహిళలు, వారి రక్షణ పేరు చెప్పి ఇలా ఎన్ కౌంటర్లు చేయడం సమంజసం కాదు. ప్రతి ఎన్ కౌంటర్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, విచారణ తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ఎన్ కౌంటర్ పై స్వతంత్ర కమిటీ విచారణ జరపాలి” వాఖ్యానించారు.