రెండు కేసుల్లోనూ సజ్జనారే కీలక పాత్ర

రెండు కేసుల్లోనూ సజ్జనారే కీలక పాత్ర

సజ్జనార్ పదేళ్ల కిందట వరంగల్‌ ఎస్పీగా ఉన్నప్పుడు యువతులపై పాశవికంగా యాసిడ్ దాడి చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. రెండు సందర్భాల్లోనూ సజ్జనారే కీలక పాత్ర పోషించడంతో ప్రజలు అప్పటి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.

వరంగల్‌లో 2008 డిసెంబర్‌లో వరంగల్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న స్వప్నిక తన స్నేహితురాలు ప్రణీతతో కలిసి స్కూటీపై కాలేజీకి వెళుతోంది. అదే సమయంలో మార్గ మధ్యలో మాటు వేసిన శ్రీనివాస్ అనే యువకుడు స్వప్నికపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక యశోదా ఆస్పత్రిలో  చికిత్సపొందుతూ చనిపోయింది.

అప్పటికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్.. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్ని ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లిన సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు.