ఎర్నాకుళం దోషికి ఉరిశిక్ష‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశ‌వ్యాప్తంగా గతేడాది సంచ‌ల‌నం సృష్టించిన ఎర్నాకుళం హ‌త్యాచారం దోషికి ఎర్నాకుళం న్యాయ‌స్థానం ఉరిశిక్ష విధించింది. ఎర్నాకుళంలోని పెరుంబ‌వూర్ కు చెందిన 30 ఏళ్ల ద‌ళిత న్యాయ‌ విద్యార్థినిపై ఆమె ఇంట్లోనే అమీరుల్ ఇస్లామ్ పాశ‌వికంగా దాడిచేశాడు. అసోంకు చెందిన వ‌ల‌సకార్మికుడైన ఇస్లామ్ .. విద్యార్థిని త‌ల్లి ఇంట్లోలేని స‌మ‌యం చూసి ఆమెపై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. ప‌దునైన ఆయుధాల‌తో ఆమె ఆంత‌రంగిక భాగాల‌పై దాడిచేశాడు.

Kerala-Dalit-Woman-Rape

ఇస్లామ్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి ఆ విద్యార్థిని మ‌ర‌ణించింది. ప‌నిమీద బ‌య‌ట‌కు వెళ్లిన త‌ల్లి ఇంటికి తిరిగివ‌చ్చేస‌రికి కుమార్తె ర‌క్త‌పు మ‌డుగులో న‌గ్నంగా ప‌డిఉంది. దీంతో ఆమె పోలీసుల‌కు స‌మాచార‌మందించింది. ఢిల్లీ నిర్భ‌య ఘ‌ట‌నను త‌ల‌పించిన ఈ అకృత్యంపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు చెల‌రేగాయి. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు బాధితురాలి ఇంటికి ద‌గ్గ‌ర‌లో నిందితుడి ర‌క్తంతో కూడిన కాలి మ‌ర‌కను గుర్తించారు. దాని ఆధారంగా ద‌ర్యాప్తు చేసిన ఇస్లాం అరెస్టు చేశారు. అత‌నిపై అత్యాచారం, హ‌త్య కేసు న‌మోదుచేశారు. ఎర్నాకుళం న్యాయ‌స్థానంలో ఈ నెల ఆరున కేసుకు సంబంధించి వాద‌న‌లు పూర్త‌య్యాయి. ఇస్లాంను దోషిగా నిర్దారిస్తూ ఆ రోజు తీర్పు ఇచ్చిన కోర్టు ఇవాళ ఉరిశిక్ష విధించింది.