కర్ణాటక ఎలక్షన్స్ : ఈవీఎం ల మొరాయింపు పలుచోట్ల పోలింగ్ కి అంతరాయం

EVM troubles in Hubli at Karnataka election 2018 Voting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు గానూ ఈరోజు 222 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. బెంహులూరు లోని జయానగర్ బీజేపీ అభ్యర్ధి మృతి చెందడంతో అక్కడా, రాజరాజేశ్వరి నగర్ లో నకిలీ వాటర్ కార్డులు బయటపడడంతో అక్కడా ఎన్నికలను 28వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో… వివిధ పార్టీలకు చెందిన మొత్తం 2600 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 2400 మంది పురుష అభ్యర్థులు కాగా 200 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మూడున్నర లక్షల మంది పోలీసులను మోహరించారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకమైనవి. దీంతో, కన్నడ నాటే కాకుండా దేశమంతా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

ఈరోజు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు ఆరుచోట్ల పోలింగ్ నిలిచిపోయింది. హుబ్లి సహా కొన్నిచోట్ల అధికారులు మొరాయించిన ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్‌ను పునరుద్ధరించారు. బీదర్‌ అర్బన్‌ నియోజకవర్గంలో వీవీ పాట్ యంత్రాలు మొరాయించాయి. నోర్మ ఫెడరీచ్‌ పోలింగ్‌ కేంద్రంలో కూడా యంత్రాలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గంటా 15 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ఈవీఎం యంత్రాలు మొరాయించడంతో పోలింగ్ అధికారులు వీవీ పాట్ యంత్రాలు తెప్పించి పోలింగ్‌ను మొదలుపెట్టారు. మొత్తం 222 స్థానాల్లో 4.96 కోట్ల ఓటర్లు… 55,600 పోలింగ్ బూత్‌ల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.