పవన్ విషయంలో ఛానెళ్లు అదే చేస్తాయో ?

what is media strategy in pawan kalyan yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్ కళ్యాణ్ – తెలుగు మీడియా మధ్య నెలకొన్న యుద్ధ వాతారణం సంగతి తెలిసిందే.  దీనితో పవన్ కల్యాణ్ పేరు చెబితేనే అంతెత్తున లేస్తోంది తెలుగు మీడియా. ముఖ్యంగా శ్రీరెడ్డి ఇష్యూ విషయంలో పవన్ కీ చానల్స్ కీ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ వివాదం మరీ హద్దులు దాటి కొన్ని న్యూస్ ఛానెళ్లు.. వాటి యజమానుల మీద పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించి ఓ వారం పాటు వాళ్లను టార్గెట్ చేశాడు పవన్. ఆ ఛానెళ్లు కూడా వాళ్ళకే అంతుంటే మాకెంత ఉండాలి అనుకుంటూ పవన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ అతడికి కవరేజీ ఇవ్వడం మానేశాయి. అసలు కొన్ని రోజుల పాటు ఛానెళ్లలో పవన్ పేరే కనిపించకుండా పోయింది అనడంలో అతిశయోక్తి కాదు. కానీ మొన్న జరిగిన ‘నేల టిక్కెట్టు’ ఆడియో వేడుకకు పవన్ రావడం.. ఆ వేడుక టెలికాస్ట్ హక్కులు పవన్ తీవ్రంగా వ్యతిరేకించన టీవీ9 ఛానెలే తీసుకోవడం ఆ వేడుకలో పవన్ తారాసపడడం ఇప్పుడు కొత్త అనుమానాలకి తావిస్తోంది. ఒకవేళ మాట్లాడుకుని రాజీకి వచ్చారా లేక ఆడియో వేడుక వేరే వారిది కాబట్టి ప్రసారం చేసారా అనే అయోమయం సాధారణ ప్రజల్లో నెలకొంది.

అయితే పవన్ కళ్యాణ్ ఈనెల 15 నుంచి తన సుదీర్ఘ రాజకీయ పర్యటనలు మొదలు పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన బస్సు యాత్రలు చేస్తున్నారని దానికోసం ఓ ప్రత్యేక బస్సు సిద్ధం అవుతోందని, బస్సు నుంచే నేరుగా ప్రజలనుద్దేశించి ప్రసంగించే ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు వింటున్నాం. ఎన్టీఆర్ ప్రచార రథం లాగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. బస్సులో కొంత మంది ముఖ్యులతో సమావేశం అయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో పవన్ కళ్యాణ్ 40 రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది. వీలును బట్టి మధ్యలో ఒకట్రెండు రోజులు సెలవు తీసుకునే అవకాసం ఉంది. దాదాపుగా ఏపీ అంతటా ఈ టూర్ సాగనుంది.

ఇప్పుడు పవన్ గురించి మీడియా ప్రసారం చేస్తుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. టీడీపీకి అనుకూలంగా ఉన్నంత కాలం పవన్ కల్యాణ్ కు పచ్చ మీడియాగా అభివర్ణిస్తున్న చానెళ్ళు బాగానే హైప్ ఇచ్చాయి. అయితే ఇప్పుడు అదే మీడియాతో ఆయన గొడవ పెట్టుకోవడంతో ప్రచారం పెద్దగా ఉండక పోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి జనాల్లోకి వెళ్తుంటే దానిని కవర్ చేయకపోతే అది ఛానెళ్లకు నష్టమే. ఎందుకంటే కవర్ చేసే చానళ్ళ టీఆర్పీలతో పోలిస్తే అది అర్ధం అవుతుంది. ఒక రకంగా పూర్తి రాజకేయల్లోకి వెళ్తున్న పవన్ కి కూడా మీడియా అవసరం ఎంతైనా ఉంది. చివరకు మీడియా పవన్ ని బహిష్కరిస్తుందో, పవనే మీడియాని ఎవాయిడ్ చేస్తాడో వేచి చూడాలి మరి.